పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గత కొన్ని నెలలుగా పవన్ న్యూ ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఆయన సినిమా లాంచ్ కి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

నవంబర్ 14 లేదా 15వ తేదీలలో పవర్ స్టార్ 26వ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా పవన్ కొత్త కథల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా దర్శకుడు క్రిష్ చెప్పిన పాయింట్ నచ్చడంతో పవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

జానపథం బ్యాక్ డ్రాప్ లో క్రిష్ కథను డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంటుందట.  ఫైనల్ గా సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి పవన్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

చివరగా అజ్ఞాతవాసి సినిమాతో గత ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న పవన్ ఈ సారి ఎలాగైనా సాలిడ్ గా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ఇక మరోవైపు పవన్ రాజకీయాలను కూడా యధావిధిగా కొనసాగించేలా పవన్ కళ్యాణ్ స్పెషల్ షెడ్యూల్స్ ని రెడీ చేసుకుంటున్నాడు.