పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అమితంగా ఆరాదించడంలో నితిన్ అభిమానులతో పోటీ పడుతుంటాడు. హీరోగా ఎంత ఎత్తుకు ఎదిగిన నితిన్ తన అభిమాన హీరోపై ప్రేమను ఏ మాత్రం తగ్గించలేదు. సినిమాల్లో ఎప్పటికప్పుడు పవన్ స్టైల్ ని అలాగే సీన్స్ ని తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూనే ఉంటాడు. ఇక భీష్మ సినిమాలో కూడా పవన్ సినిమాలోని సీన్ ని వాడేశాడు.

పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాలో ప్రతి సన్నివేశం ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అయితే అందులో టెంపుల్ లో దీపం సీన్ ఎంతగా క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అదే తరహాలో భీష్మ సినిమాలో కూడా నితిన్ ట్రై చేసినప్పటికి అది ఫెయిల్ అయ్యింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవంతిక స్పెషల్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఛలో లాంటి బాక్స్ ఆఫీస్ హిట్ అనంతరం యువ దర్శకుడు వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ రెగ్యులర్ ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఫిబ్రవరి 21న భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.