రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ మూవీ పింక్ సినిమాను రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ పేరుతో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఈ సినిమా తరువాత పవన్‌, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్వకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగ పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. రాబిన్‌ హుడ్‌ తరహాలో ప్రజలకు సాయం చేసే పాత్ర కావటంతో ఈ సినిమా పవన్‌ పొలిటికల్ కెరీర్‌ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ చేస్తున్న తొలి కాస్ట్యూమ్ డ్రామా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

క్రిష్ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా కన్‌ఫార్మ్ చేశాడు పవన్‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు పవన్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. గతంలో పవన్‌, హరీష్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. కెరీర్ ఇంతవరకు సరైన బ్రేక్ లేని లావణ్యకు ఇది గోల్డెన్‌ చాన్సే అంటున్నారు సినీ జనాలు. మరి ఈ సినిమాతో అయినా ఈ భామకు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
Image result for Lavanya Tripathi