పవన్ కళ్యాణ్ సినిమాకి డేట్స్ ఇచ్చాడనే కానీ.. నిర్మాతతో సహా చిత్రబృందం మొత్తానికి సినిమా విషయంలో టెన్షన్ మొదలైంది. సినిమా షూటింగ్ కి ఉదయం 7 గంటలకే వచ్చి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొని.. ఆ తరువాత పార్టీ కార్యకలాపాల కోసం మంగళగిరి వెళ్తున్నారు.

ఇలా ఒకట్రెండు రోజులు చేస్తే సరిపోదు.. దాదాపు రెండు, మూడు నెలల వరకు ఇలా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే మొదటిరోజే పవన్ కి పరిస్థితి అర్ధమైంది. మధ్యాహ్నమే ప్యాకప్ చెప్పి.. రాత్రికి మంగళగిరి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఉన్నారు. మళ్లీ ఈరోజు షూటింగ్ కి హాజరవ్వాలి.

లుక్ టెస్ట్ కంప్లీట్.. మొఘల్ సామ్రాజ్యంలో పవన్.. ఉత్కంఠ రేపేలా క్రిష్ చిత్రం!

అంటే మధ్యలో పవన్ కి రెస్ట్ కూడా దొరకదు. అలా అలిసిపోయి పవన్ షూటింగ్ లో పాల్గొంటాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఉదయం షూటింగ్, సాయంత్రం పార్టీ మీటింగ్ అంటూ పవన్ చేస్తోన్న ఈ ప్రయాణం ఒకదానికొకటి పొంతన కూడా లేదు. రెండు పడవల మీద పవన్ ప్రయాణం చేస్తున్నాడు.

పార్టీ మీటింగ్ లో ఏదైనా హడావిడి జరిగినా.. పవన్ అందుబాటులో ఉండాల్సిన అవసరం వచ్చినా.. షూటింగ్ ని క్యాన్సిల్ చేసేస్తారు. పవన్ వస్తాడా..? రాడా..? అనే విషయంలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షూటింగ్ ప్లాన్ చేసుకోవాలి. అలా అయితే సినిమాలో నటించే మిగతా ఆర్టిస్ట్ లకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

వారి కాల్షీట్స్ కూడా క్యాన్సిల్ చేయడం వంటివి చేయాలి. అలా చేసుకుంటూ పోతే నిర్మాతకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. మొన్నటివరకు పవన్ కాల్షీట్స్ ఇస్తే చాలనుకున్న నిర్మాతలు ఇప్పుడు షూటింగ్ అనుకున్న సమయానికి అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. వేణుశ్రీరాం డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.