చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు బయటకు అడుగుపెట్టారు. తన అభిమాని, యువ హీరో నితిన్ పెళ్ళికొడుకు వేడుకకు హాజరయ్యారు. శివ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సాధువులా బొట్టు ధరించి దీక్ష వస్త్రాలలో వచ్చారు. 

పవన్ కళ్యాన్ తో పాటుగా అ.. ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఆ చిత్రంతో త్రివిక్రమ్ కి నితిన్ ఫ్యాన్ బాయ్ గా మారిపోయారు. ఈ ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

ఈ ఫొటోలో నితిన్ సైతం ట్రెడిషనల్ లుక్ లో కుర్తా పైజామాలో కనిపించాడు. ముగ్గురు ఒకే ఫ్రెమ్ లో ఉండడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసిన అతి కొద్దీ మంది నటుల్లో నితిన్ ఒకడు. పవన్ కి వీర భక్తుడైన నితిన్ కోసం పవన్ కళ్యాణ్ ఇలా బయటకు రావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు. . 

ఇకపోతే... ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘రెక్‌లెస్‌ జెనెటిక్‌ వైరస్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 కంటెస్టెంట్‌ నూతన్‌ నాయుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 99 థియేటర్‌ బ్యానర్‌పై సీఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ టీజర్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది.