పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమాతో రెడీ అవుతున్న సంగతి తలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కేవలం రెండు నెలల గ్యాప్ లోనే వరుసగా 4 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను కూడా చక చకా ఫినిష్ చేస్తున్నాడు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో వకీల్ సాబ్ మొదలెట్టిన పవర్ స్టార్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.గబ్బర్ సింగ్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమాను ఒకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.  ఇక సీక్రెట్ గా అందిన సమాచారం ప్రకారం మరీకొన్ని కథలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో కాటమరాయుడు డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని (డాలి) కూడా ఉన్నట్లు సమాచారం.  అప్పట్లో కాటమరాయుడు సినిమా కమర్షియల్ గా మంచి లాభాలను అందించిన విషయం తెలిసిందే. అంతకుముందు గోపాల గోపాల అనే సినిమాకు కూడా దర్శకత్వం చేసి పవన్ దృష్టిని ఆకర్షించిన డాలీ ఇప్పుడు మరొక స్క్రిప్ట్ తో మెప్పించినట్లు తెలుస్తోంది. కుదిరితే వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.