టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కేవలం రెండు నెలల గ్యాప్ లోనే వరుసగా 5 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో పింక్  రీమేక్ కి మొదలెట్టిన పవన్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

ఇక రీసెంట్ గా తనకు గబ్బర్ సింగ్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమాను ఒకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక సీక్రెట్ గా అందిన సమాచారం ప్రకారం మరీకొన్ని కథలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా పవన్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అలాగే గోపాల గోపాల దర్శకుడు డాలి తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందట. సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ కూడా పవన్ తో ఒక సినిమా చేయాలనీ ఆలోచిస్తున్నాడు. వీరితో పవన్ ఇటీవల కొత్త సినిమాలకు సంబందించి డిస్కస్ చేసినట్లు టాక్. ఈ సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుంది.   పింక్ రీమేక్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్  ఇదే ఏడాది మే నెలలో రానుంది. ఇక క్రిష్ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇక హరీష్ శంకర్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ (మే) లో వచ్చే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ పవన్ పాంచ్ పటాకా ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.