పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రంతో పవన్ తన అభిమానులకు ఊహించని స్థాయిలో మాస్ విజువల్ ట్రీట్ అందించనున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. 

భీమ్లా నాయక్ Bheemla Nayak చిత్రంలో ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఖుషీ చేశాడు. అయితే ఈ చిత్రంలో అభిమానులకు పవన్ నుంచి కావాల్సిన మాస్ యాక్షన్ రాలేదనేది టాక్. అందుకే పవర్ స్టార్ తన తాజాచిత్రం ‘హరిహర వీరమల్లు’పై ఫోకస్ పెట్టారు. Hari Hara Veera Mallu చిత్రంలో గతేడాది కోవిడ్ కారణంగా షూటింగ్ ను మధ్యలోనే తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. భీమ్లా నాయక్ మేనియా ముుగిసిన తర్వాత ఏప్రిల్ 8న షూటింగ్ పున: ప్రారంభించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చిత్ర యూనిట్ శ్రీరామనవమి సందర్భంగా తాజాగా హరిహర వీరమల్లు నుంచి న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ను గతంలో ఎప్పుడూ తన అభిమానులు చూడని విధంగా మేకర్స్ ఈ సినిమాల చూపించబోతున్నారు. కాగా, రిలీజైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రెండు చేతుల్లో పవన్ కళ్యాణ్ బళ్లాలను పట్టుకొని అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. చిరుతపులి లాంటి చూపులతో గంభీరత్వాన్ని ప్రదర్శించారు. గ్రీన్ షర్ట్ ధరించి, ఆపై శాలువా చుట్టుకొని ఉన్న సరికొత్త లుక్ ను సొంతం చేసుకున్నాడు. బ్యాక్ డ్రాప్ పరిశీలిస్తే ఒక గ్రామ కూడలి వద్ద జరిగే యాక్షన్ సీక్వెన్స్ గా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. మిగిలిన భాగాన్ని చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే పీరియాడ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ డ్రామాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా పాత్రకు అనుగుణంగా తన మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశాడు. మరోవైపు యుద్ధ విన్యాసాలతోనూ ఆకట్టకుంటున్నాడు. ఇప్పటికే సెట్ నుంచి విడుదలైన రిహార్సల్ ఫొటోలు, వీడియోలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అదిరిపోయే స్టంట్స్ తో పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

ఈ చిత్ర కథ 17వ శతాబ్దంలోని మొఘల్ పరిపాలన సమయానికి చెందినగా తెలుస్తోంది. అప్పటి అన్యాయాలను ఎదురించే తిరుగుబాటు దారుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎం. రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…