సౌత్ స్టార్ హీరోల క్రేజ్ ఈ మధ్య కాలంలో తారా స్థాయికి చేరుకుంటోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ లిస్ట్ ఉన్నాడని నిన్న విడుదలైన వకీల్ సాబ్ పోస్టర్ తో మరొకసారి అర్థమైపోయింది. రెండేళ్లు గా వెయిట్ చేసిన అభిమానులకు పవర్ స్టార్ అదిరిపోయే కిక్కిచ్చాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే ఫ్యాన్స్ ఒక సినిమా రిలీజ్ అవుతున్న రేంజ్ లో సంబరాలు చేసుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే ట్రేండింగ్ లిస్ట్ లో టాప్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ దర్శనమిచ్చింది. ఇక నిన్న విడుదలైన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సూర్యవంశీ ట్రైలర్ ట్విట్టర్ టాప్ ట్రేండింగ్ లిస్ట్ లో ఎక్కువ సేపు నిలవలేకపోయింది. పవన్ ఫ్యాన్స్ గ్యాప్ లేకుండా రీ ట్వీట్స్ తో చరిత్ర సృష్టించారు. కేవలం ఫస్ట్ లుక్కే ఈ రేంజ్ లో ఉందంటే సినిమా టీజర్ - ట్రైలర్ - కి అభిమానులు ఇంకా ఈ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారో అనేది ఊహలకు అందడం లేదు.

ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడితే.. ఆ అంచనాల డోస్ కూడా వర్ణనాతీతం. సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మస్తున్నారు.