సాధారణంగా పెద్ద బ్యానర్స్ ...తమ సంస్ద లో సినిమా చేసే దర్శకులకు కొన్ని కండీషన్స్ పెడుతూంటాయి. వారి తదుపరి చిత్రం తమ బ్యానర్ లోనే తాము ఇచ్చిన రెమ్యునేషన్ తోనే చెయ్యాలని. అందుకు కారణం తమ బ్యానర్ కు ఉన్న క్రేజ్ తో సినిమా హిట్ కొట్టి, ఆ తర్వాత వేరే చోట కు వెళ్లి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవటం పద్దతి కాదు భావిస్తూంటారు.

అయితే కొన్ని కొన్ని పరిస్దితుల్లో ఆ కండీషన్స్ ని సడలిస్టూంటారు కూడా. దర్శకుడు పరుశరామ్ కూడా లెక్క ప్రకారం ..గీతా ఆర్ట్స్ లోనే నెక్ట్స్ సినిమా చెయ్యాలి కానీ, అల్లు అరవింద్ ఇచ్చిన మినహాయింపుతో బయిట బ్యానర్ కు వెళ్లి సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బ్యానర్ లో గీతా గోవిందం, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు చేసారు. అయితే మూడో సినిమా కు మాత్రం తప్పుకున్నారు.

అర్జున్ రెడ్డితో సంచ‌ల‌నం రేపిన విజ‌య‌దేవ‌ర కొండ హీరోగా, ఛ‌లో మూవీతో యూత్ ని ఆక‌ట్టుకున్న క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక హీరోయిన్ గా, యంగ్ డైరెక్ట‌ర్ ప‌రుశ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'గీత గోవిందం' చిత్రం క్రితం సంవత్సరం ఆగ‌స్ట్ 15న విడుద‌ల అయ్యింది.  పెద్ద హిట్టైంది.  సినిమా మంచి విజయం సాధించటంతో...దర్శకుడు పరుశరామ్.. ప్రేక్షకులతో పాటు ప్రముఖల దగ్గర నుంచి కూడా విలువైన ప్రశంసలను అందుకున్నారు. ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారారు.

గీతా ఆర్ట్స్ లోనే తదుపరి సినిమా చేస్తాడని అందరూ భావించారు.  అయితేనేం పరుశరామ్ కు  తన తదుపరి చిత్రం చేయటానికి హీరో దొరకలేదు. అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగినా, రకరకాల కారణాలతో సంవత్సరం దాటి ఆరు నెలలు పైగా అయ్యినా మరో సినిమా స్టార్ట్ కాలేదు. అప్పటి నుంచి ఆయన వరస ప్రయత్నాలు చేస్తున్నా సరే ఏ హీరోని లాక్ చేయలేకపోయారు.  బన్నితో అని కొద్ది రోజులు, మహేష్ తో అని మరికొన్ని రోజులు..అబ్బబ్బే అవేం కాదు..

అఖిల్ తో చేయబోతున్నాడని అన్నారు. కానీ ఏవీ మెటీరియలైజ్ కాలేదు. కానీ రీసెంట్ గా ఆయన తన తదుపరి ప్రాజెక్టు సంభందించిన హీరోని ఓకే చేసుకున్నారు. అయితే గీతా ఆర్ట్స్ లో ఆ సినిమా  ఉంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పరుశరామ్ చెప్పిన కథకు అక్కినేని నాగచైతన్య ఇంప్రెస్ అయ్యి..వెంటనే డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు.

ఓ రొమాంటిక్ కామెడీ స్క్రిప్టుని నాగచైతన్యకు చెప్పి ఒప్పించిన పరుశరామ్ త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నారు. 2020 ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రారంభం కావచ్చు.  ఈ సినిమాకు సంభందించిన ఎనౌన్సమెంట్ వచ్చింది. ఇక ఈ సినిమాని 14 రీల్స్ బ్యానర్ పై గోపీ ఆచంట, రామ్ ఆచంట కలిసి నిర్మిస్తారు. ఈ సినిమాతో చైతులోని మరో యాంగిల్ ని పరుశరామ్ ఆవిష్కరించబోతున్నారట.

పరుశరామ్ మాట్లాడుతూ..కేవ‌లం ఒక సెక్ష‌న్ ఆఫ్ ఆడియెన్స్ ని టార్గెట్ చేద్దామ‌ని క‌థ‌లు రాసుకోవ‌డం అనే జ‌ర‌గ‌దు. ఓ క‌థ ఎవ‌రికి న‌చ్చాలో వారికే న‌చ్చుతుంది. యాధృచికంగా నా నుంచి వ‌చ్చిన లాస్ట్ రెండు సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ కి న‌చ్చింది. కానీ గీత‌గోవిందం ఇటు యూత్ కి అటు ఫ్యామిలీస్ కి న‌చ్చింది.  ఇప్పుడు చేయబోయే కథ కూడా అన్ని వర్గాలకు నచ్చేలా డిజైన్ చేసాము అంటున్నారు.