పెళ్ళి డ్రెస్ లో.. పరిణితి చోప్రా _ రాఘవ్ చద్దా ఫన్నీ డాన్స్, వైరల్ అవుతున్న వీడియో..
ఈమధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ కపుల్ పరిణితి చోప్రా.. రాఘవ్ చద్దా. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో పెళ్ళి బట్టల్లో మెరిసిపోయారు జంట. ఈ డ్రెస్ లోనే వీరు చేసిన డాన్స అందరికి ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ స్టార్ నటి పరిణితీ చోప్రా.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్ద వివాహం రీసెంట్ గా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గల లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రేముఖులో పాటు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు.. సినిమా సెలబ్రిటీలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా, లాంటి స్టార్స్, తదితరులు పెళ్లికి హాజరై దంపతులను ఆశీర్వదించారు.
కోట్లు ఖర్చు పెట్టి జరిగిన ఈ పెళ్ళి గురించి రోజుకో టాపిక్ హైలెట్ అవుతోంది. పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను పరిణీతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఈ జంట బాగుందంటూ.. కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వేడుకలో భాగంగా రాఘవ్-పరిణీతి ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి అతిథులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇక వీరిద్దరు కలిసి ఇండస్ట్రీతో పాటు... రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేక విందు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొంత కాలంగా వీరు రహస్యంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఎవిరికీ ఈ విషయం తెలియదు. ఆమధ్య బయట రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ... కెమెరాల కంట పడ్డారు. అప్పటి నుంచి వీరి మీద మీడియా నిఘా ఉండటంతో.. అసలు విషయం బయటకు వచ్చింది.
రాఘవ్, పరిణీతి ఒకే స్కూల్ చదువుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్ పరిణీతి రాణిస్తుంది. మరోవైపు రాఘవ్ చద్దా యువ ఎంపీగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు కలిసేతిరుగుతున్నారు. ఆ మధ్య పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ని కలిసి తిలకించడం విశేషం. అంతే కాదు వీరిద్దరు కలిసి విదేశాలకు కలిసి తిరగడంతో పాటు.. ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేశారు.