చిరు 'లూసిఫర్' రీమేక్ కి డైరక్టర్ అతనేనా..?

అందుతున్న సమాచారం మేరకు డైరక్టర్ పరసరామ్ కు ఈ సినిమా భాధ్యతలు అప్పగించనున్నారు. గీతాగోవిందం చిత్రంతో హాట్ డైరక్టర్ గా మారిన పరుశరామ్ ...ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా కమిటయ్యారు

Parasuram will remake Lucifer Remake with Chiru?

సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన మళయాళ బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫృద్వీరాజ్ మీడియాతో చెప్పటంతో బయిటకు వచ్చింది. ఈ నేపధ్యంలో  ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు డైరక్టర్ పరసరామ్ కు ఈ సినిమా భాధ్యతలు అప్పగించనున్నారు. గీతాగోవిందం చిత్రంతో హాట్ డైరక్టర్ గా మారిన పరుశరామ్ ...ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా కమిటయ్యారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక..చిరంజీవి మూవీని టేకోవర్ చేస్తారని వినికిడి. ఈ లోపులో చిరు కూడా..కొరటాల శివ మూవీని సెట్ రైట్ చేసి బయటకు వస్తారు.

లూసిఫర్ రీమేక్.. మెగాస్టార్ కి సుకుమార్ సాయం?

‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రితం సంవత్సరం ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది.

ఆ చిత్రం కథేమిటంటే...  రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ (సచిన్ ఖేడేకర్) హఠాత్తు మరణం తరువాత ఆయన వారసుడు ఎవరనే చర్చ మొదలు అవుతుంది. రాష్ట్రం అంతా  కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అని చర్చించుకుంటున్న  నేపధ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. అప్పుడు పి.కె.అర్ కి అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ గట్టు పల్లి (మోహన్ లాల్)సీన్ లోకి వస్తారు.  పి.కె.అర్ కి తను ఇచ్చిన మాట ప్రకారం ఆయన  కుమార్తె ప్రియ (మంజు వారియర్)అండగా నిలబడి ఆమెను సమస్యల నుండి బయట పడేస్తాడు.

ఈ క్రమంలో ప్రియ రెండో భర్త బాబీ (వివేక్ ఒబెరాయ్) వల్ల స్టీఫెన్ కు రకరకాల సమస్యలు వస్తాయి.  అంతే కాదు కొంతమంది స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా స్టీఫెన్ పై కొన్ని నిందలు పడతాయి.  ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్యన  ప్రియ (మంజు వారియర్)ను సేవ్ చేయటం ప్రధానాంశంగా కథ నడుస్తుంది. అందుకోసం స్టీఫెన్ ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు చుట్టూ సినిమా తిరుగుతుంది.

Parasuram will remake Lucifer Remake with Chiru?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios