రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ అంటూ సూపర్ హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం అవుతున్నారు.అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారు. దాంతో మహేష్ నెక్ట్స్ చేయబోయే దర్శకుడు ఎవరనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది. ఇప్పటికే ఓ కొత్త కుర్రాడు మహేష్ కు స్టోరీలైన్ చెప్తే నచ్చి, దాని మీద వర్క్ చేయమన్నారు. అయితే ఇమ్మిడియట్ గా ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే దర్శకుడు కోసం మహేష్ వెతుకుతున్నారుట. అందులో భాగంగా సురేంద్రరెడ్డి ని పిలిస్తే...ఆయన తన దగ్గర కథ లేదని నిజాయితీగా చెప్పి ప్రక్కకు వచ్చారట. అప్పుడు తనకు ఇంతకు ముందు కథ చెప్పిన పరుశరామ్ గుర్తు వచ్చి పిలిపించినట్లు సమాచారం.

గీతా గోవిందం తర్వాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలో పరుసరామ్ ...ఓ కథని మహేష్ కోసం రెడీ చేసి నేరేట్ చేసారు. అయితే ఆ కథ మరీ తన వయస్సుకు చిన్నదైపోతుందని, ఎవరైనా కుర్ర హీరోలు చేస్తే బాగుంటుందని నో చెప్పేసారట. దాంతో పరసరామ్ ..నాగచైతన్య తో తన తదుపరి సినిమా మొదలెట్టారు. 14 రీల్స్ ప్లస్ వారు ఈ  సినిమాని నిర్మిస్తున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ప్రకటన కూడా వచ్చింది.
 
అయితే ఇప్పుడు మహేష్ తనతో సినిమాని వెంటనే పట్టాలు ఎక్కించే దర్శకుడు కోసం చూస్తున్నారు.ఈ క్రమంలో మరో స్టోరీ లైన్ ఉంటే చెప్పమని పరుశరామ్ ని అడగటం జరిగిందిట. పరుసరామ్ తన దగ్గర ఉన్న రొమాంటిక్ కామెడీ స్టోరీ లైన్ చెప్పటం, మహేష్ ఓకే చెప్పటం చేసారట. సరదా సరదాగా సాగిపోయే కథనంతో ఉంటే పాయింట్ అది. అయితే స్క్రిప్టు ఇంకా రెడీ కాలేదు. దాంతో మహేష్ వెంటనే స్క్రిప్టు రాయటం మొదలెట్టమని పురమాయించాడట. మైత్రీ మూవీస్ వారు నిర్మించే ఈ ప్రాజెక్టు ...అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.