అప్పట్లో ఎన్టీఆర్ నటించిన  పరమానందయ్య శిష్యుల కథ పెద్ద సక్సెస్. అంతకు ముందు అక్కినేని సైతం ఇదే కథతో సినిమా చేసారు. అదీ బాగానే నడించింది. ఆ తర్వాత టీవీ సీరియల్ గా వచ్చి ఘన విజయం సాధించింది. ఇలా తెలుగు వారికి ఇష్టమైన కథగా పరమానందయ్య శిష్యులు కథ ప్రతీ తరాన్ని అలరిస్తూనే ఉంది. ఈ తరాన్ని కూడా అలరించటానికి రెడీ అవుతోంది.

పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సిహెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా వెంకట రాజేష్ పులి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా చిన్నారుల కోసం 3డి ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమాగా శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ని డైనమిక్ డైరెక్టర్ మారుతీ విడుదల చేశారు.

ఈ సందర్బంగా మారుతీ మాట్లాడుతూ చిన్నారుల కోసం, పిల్లలకు నచ్చేలా ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు ఈ చిత్ర బృందానికి నా అభినందనలు తెలుపుతున్నాను.

పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విషయాలు తెలుపుతామని నిర్మాతలు చెప్పారు.