రాంగోపాల్ వర్మ మరో కాంట్రవర్షియల్ సబ్జెక్టతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు వివాదాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో అనేక వివాదాలు ఎదుర్కొన్నాడు. 

ఈసారి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టడంపై నేరుగా ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్స్ గమనిస్తే.. వర్మ వైయస్ జగన్ ని హై లైట్ చేస్తూ.. చంద్రబాబు కుటుంబంపై సెటైర్లు వేయబోతున్నట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ లో చంద్రబాబు పాత్రధారి ఆయన తనయుడికి పప్పు వడ్డిస్తున్న సన్నివేశం ఇప్పటికే చర్చనీయంశంగా మారింది. 

ఈసారి ఏకంగా 'పప్పు లాంటి అబ్బాయి' అంటూ సాగే పాటనే వర్మ విడుదల చేశారు. ఈ పాటలో సెటైరికల్ లిరిక్స్, చంద్రబాబు పాత్రధారి అయన తనయుడి మధ్య జరుగుతున్న సన్నివేశాలు అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. 

'పప్పులాంటి అబ్బాయి.. శుద్దపప్పు చిన్నారి' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ వీడియో సాంగ్ లో వర్మ చంద్రబాబు ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేశాడు. ఇప్పటికే ఈ అంశం వివాదంగా మారడంతో వర్మకు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ద్వారా చంద్రబాబుని, నారా లోకేష్ ని టార్గెట్ చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. అసలు ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్ పాత్రలే లేవు.. అది మీ ఊహ మాత్రమే అని వర్మ సమాధానం ఇచ్చాడు. 

రవిశంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అజయ్ మైసూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇంకెన్ని వివాదాలు సృష్టించనుందో..