పాకిస్థాన్ విమాన ప్రమాదంలో తాను చనిపోలేదని.. నటి అయేజా ఖాన్ తెలియజేసింది. పాకిస్థాన్‌లోని కరాచీలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ విమాన ప్రమాదంలో తాను, తన భర్త మరణించినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ నటి అయేజా ఖాన్ ఖండించింది. ఆ విమానంలో తాము లేమని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. 

కాగా, 99 మంది ప్రయాణికులతో కుప్పకూలిన ఈ విమానంలో అయేజా, ఆమె భర్త డానిష్ తైమూర్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన నటి అయేజా.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను మానుకోవాలని హితవు పలికింది. ఇప్పటికైనా ఈ వదంతులకు చెక్ పెట్టాలని కోరింది. దయచేసి ఇకనైనా సవ్యంగా వ్యవహరించాలని అయేజా కోరింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం పాక్ లో కరాచీ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో 100 చినిపోయిన విషయం తెలిసిందే.