బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే స్దాయిలో అభిమానులను,బిజినెస్ ను సంపాదించుకున్నారు.  దాంతో ఆయన తాజా చిత్రం జాన్(వర్కింగ్ టైటిల్) కు  ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. సాహో ప్లాఫ్ అయినా దాని ఇంపాక్ట్ కనపడటం లేదు. ఓ రేంజిలో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు వినికిడి. తాజాగా ఓవర్ సీస్ డీల్ ని లాక్ చేసినట్లు సమాచారం.

ఓవర్ సీస్ లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రం రైట్స్ ని 25 కోట్లకు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ డీల్ ...ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్యే అన్ని లాంగ్వేజ్ లకు కలిపి అని తెలుస్తోంది. దాంతో నిర్మాతలు కాస్త రిలాక్స్ అయ్యినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో ఓవర్ సీస్ పెద్దగా బాగోలేదు. అయితే సంక్రాంతికి రిలీజైన అలవైకుంఠపురం అక్కడ దుమ్ము రేపుతూండటంతో మళ్లీ ఊపిరి పోసినట్లైంది. ఈ నేపధ్యంలో ఈ రైట్స్ ని ఆ రేటుకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ ను జరుపుకుంది.అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాను  2020 దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. దసరా సెలవులకు పది రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా అతి త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.  

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.