Asianet News TeluguAsianet News Telugu

#GodFather:'ఆచార్య' తో చిరు పని అయ్యిపోయిందనుకునే వాళ్లకు భారీ షాక్

దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిరంజీవి , నయనతార , సత్యదేవ్ తాలూకా ఫస్ట్ లుక్ , ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ సాంగ్ లు సినిమా ఫై క్రేజ్ తెచ్చాయి.  

OTT and Satellite Rights of GodFather would be around?
Author
First Published Sep 22, 2022, 12:20 PM IST


చిరంజీవి ఆచార్య ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఆ సినిమాతో చిరు క్రేజ్ అయ్యిపోయిందని, చివరకు కొరటాల శివ వంటి స్టార్ డైరక్టర్ కూడా ఏం చెయలేకపోయారని, తన కొడుకు సాయిం పట్టినా సినిమా అడుగు ముందుకు వెయ్యిలేకపోయిందని అన్నారు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా చిరు తాజా చిత్రం గాడ్ ఫాదర్ బిజినెస్ పై పడుతుందని భావించారు. అయితే చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. 

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్ర ఓటిటి,శాటిలైట్ డీల్ అదిరిపోయే రేటుకు  కుదిరినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిరంజీవి , నయనతార , సత్యదేవ్ తాలూకా ఫస్ట్ లుక్ , ‘థార్ మార్ థ‌క్క‌ర్ మార్’ సాంగ్ లు సినిమా ఫై క్రేజ్ తెచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ ని 110 కోట్లకు వెళ్లినట్లు సమాచారం. దాంతో మెగా క్యాంప్ యాంటి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చిరంజీవి క్రేజ్ అసలు తగ్గకపోవటం వారిని ఆశ్చర్యపరుస్తోంది. 

ఇక ఓటిటి రైట్స్ దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడగ చివరగా నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లుగా వినికిడి. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమలో హీరో సత్యదేవ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించాడు. ఇందులో చిరుకి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు.
    
 ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios