లాస్ ఏంజిల్స్: 92వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అత్యంత వైభవంగా సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ ‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది.

ఆస్కార్ బరిలో మొత్తం తొమ్మిది చిత్రాలు నిలిచాయి. బెస్ట్ యానిమేటేడ్ షార్ట్‌ఫిల్మ్‌గా హెయిర్ లవ్ చిత్రం నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీ‌న్‌ప్లే కింద పారా సైట్ చిత్రం దక్కించుకొంది.

వన్స్ అపాన్  ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా టాయ్ సోర్టీ చిత్రం దక్కించుకొంది.బెస్ట్ యామిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా హెయిర్ లవ్ ఎంపికైంది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే జోజో ర్యాబిట్ దక్కించుకొన్నారు.