నందమూరి బాలకృష్ణ ప్రస్తుతమ్ నటిస్తున్న చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నిరాశపరిచిన తర్వాత ఓ హిట్ మూవీ తో తన అభిమానులని సంతృప్తి పరచాలని బాలకృష్ణ భావిస్తున్నాడు. 

రూలర్ చిత్రం అన్ని కార్షియల్ హంగులతో తెరకెక్కుతోంది. బాలయ్య సరసన ఈ చిత్రంలో అందాల భామలు సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్నారు. భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య గెటప్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఫ్రెంచ్ కట్ గడ్డంతో బాలకృష్ణ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు. 

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ని రిలీజ్ చేసింది. బాలకృష్ణ గోల్ఫ్ ఆడుతూ రిచ్ మ్యాన్ లాగా ఇస్తున్న ఫోజు అదిరిపోయింది. చిత్రయూనిట్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసిందో లేదో అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. 

ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ గెటప్ లో కూడా కనిపించనున్నాడు. అంటే ఈ మూవీ లో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.