ప్రస్తుతం బాలీవుడ్ లో దక్షణాది కథలకు డిమాండ్ బాగా పెరిగింది. షాహిద్ కపూర్ లాంటి క్రేజీ హీరోలు వరుసపెట్టి టాలీవుడ్ చిత్రాలని రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని సూపర్ హిట్ చిత్రం జెర్సీ రీమేక్ లో నటిస్తున్నాడు. 

ఇదిలా బాలీవుడ్ యంగ్ హీరో సౌత్ చిత్రంపై కన్నేసాడు. బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన ఓ చిత్ర హిందీ రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ చిత్రం మరేదో కాదు.. ప్రస్తుతం రామ్ నటిస్తున్న రెడ్. తమిళంలో అరుణ్ విజయ్ నటించిన తడం చిత్రం గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. 

ప్రస్తుతం అదే చిత్రాన్ని రామ్ రీమేక్ చేస్తున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా తడం సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడట. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్నేళ్లుగా సౌత్ ఫిలిం మేకర్స్ బలమైన కథలతో సినిమాలు చేస్తున్నారు. 

43 ఏళ్ల బ్యూటీ బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో సెగలు!

సౌత్ లో సూపర్ హిట్ అయిన ఏ చిత్రాన్ని కూడా బాలీవుడ్ వాళ్ళు వదిలిపెట్టడం లేదు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన తడం తమిళ ప్రేక్షుకులని మెప్పించింది. తెలుగులో రామ్ నటిస్తున్న రెడ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. హిందీలో ఈ చిత్రాన్ని వర్ధన్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు. కబీర్ సింగ్ నిర్మాత మురాద్ ఖేథాని ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు.