టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో ఎలాంటి సక్సెస్ లు అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాల సినిమా అతని కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.  హీరోయిన్ అవికా గోర్ కూడా  ఆ సినిమాతో మంచి అవకాశాలు అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగార్జున నిర్మించిన ఆ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించాడు.

అయితే ఇప్పుడు ఈ ఉయ్యాల జంపాల దర్శకుడు హీరో మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్లు టాక్ వస్తోంది. గతంలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.  ఇక మళ్ళీ రెండేళ్ల తరువాత దర్శకుడు హీరో ఒక సినిమా చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. గతకొంత కాలంగా రాజ్ తరుణ్ వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.

ఎన్ని సినిమాలు చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మళ్ళీ తన మొదటి సినిమా దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు దర్శకుడు విరించి వర్మ మజ్ను అనంతరం మరో హీరోతో సినిమా సెట్ చేసుకోలేకపోతున్నాడు. ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఏమి రాలేదు. ఇక మొత్తానికి ఇప్పుడు ఉయ్యాలా జంపాల లాంటి సక్సెస్ అందుకోవాలని డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.