సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచుగా సినీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాదాపు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ టాలీవుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. టాలీవుడ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా తలసాని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

కొన్ని రోజుల క్రితం తలసాని.. చిరంజీవి, నాగార్జునతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి జూబ్లిహిల్స్ లోని  అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఈ సమావేశం జరిగింది. 

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను తలసాని  ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరించాలని కూడా నిర్ణయించారు. 

సినీ,టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని కూడా నిర్ణయించారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు  త్వరితగతిన అనుమతులు ఇవ్వబోతున్నారు. Fdc ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతాం అని తలసాని అన్నారు. 

ఓవైసీపై షాకింగ్ కామెంట్స్.. మోడీ సామాన్యుడు కాదు అంటూ హీరోయిన్ పోస్ట్!

పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు  తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం అని మంత్రి తెలిపారు. పైరసీ నివారణ కోసం చాలా కాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ పైరసీని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది కాబట్టి పైరసీ నివారణ ఎంత వరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి.  ఈ సమావేశం కోసం తలసాని కేవలం చిరంజీవి, నాగార్జున లని మాత్రమే ఆహ్వానించడం ఆసక్తిగా మారింది.