రాజుగారి గది 3 చిత్రంలో ఓంకార్ సోదరుడు అశ్విన్, యంగ్ హీరోయిన్ అవికా గోర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. శుక్రవారం రోజు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓంకార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

రాజుగారి గది 3 చిత్రం హర్రర్ కామెడీ ప్రధానంగా తెరకెక్కింది. హర్రర్ ఎలిమెంట్స్ తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు ఓంకార్ సిద్ధం అయ్యాడు. కింగ్ నాగార్జున నటించిన రాజుగారి గది 2 చిత్రం పర్వాలేదనిపించింది. వాస్తవానికి ఈ చిత్రంలో వెంకటేష్ నటించాల్సిందట. 

ఓంకార్ మాట్లాడుతూ.. ఆ సమయంలో వెంకటేష్ గారు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందుకే నాగార్జున గారు చేశారు. వెంకటేష్ తో సినిమా చేయాలనేది నా కల. రాజుగారి గది సిరీస్ లో ఒక పార్ట్ తప్పకుండా వెంకటేష్ తోనే చేస్తాను అని ఓంకార్ తెలిపాడు. 

తమన్నా రాజుగారి గది 3 నుంచి తప్పుకున్న తర్వాత కథలో చాలా మార్పులు చేసినట్లు ఓంకార్ తెలిపాడు. బిజీగా ఉండడం వల్లే తమన్నా ఈ చిత్రంలో నటించడం కుదర్లేదని తెలిపాడు.