స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సుశాంత్, నవదీప్, నివేతా పేతురాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.

టైటిల్ టీజర్ ని ముందుగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత  'సామజవరగమన', 'రాములో రాములా' పాటలు అంచనాలకి మించి హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డులు సృష్టించాయి. వీటికి పోటీగా పాటలు విడుదల చేయడానికి మిగిలిన సినిమాలు వెనుకడుగు వేస్తున్నాయంటే ఈ పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు.

రంగస్థలం పిల్ల సెక్సీ ఫోజులు.. బ్లాక్ డ్రెస్ లో కిర్రాక్ లుక్స్!

అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి మూడో పాట వచ్చింది. అదే 'ఓ మై గాడ్‌ డాడీ'. ఈ పాట ఒకరకంగా 'అల వైకుంఠపురములో' జోరుకి కాస్త బ్రేకులు వేసిందనే చెప్పాలి. మొదటి రెండు పాటలు సంచలన విజయాన్ని సాధిస్తే.. మూడో పాట మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. స్లోగా అయినా.. ఈ పాట జనాలకు ఎక్కుతుందని అనుకున్నారు కానీ అది కూడా జరగడం లేదు. 

మొదటి రెండు పాటలపై వచ్చిన బజ్ మూడో పాటపై రాలేదు. దీంతో ఆలస్యం చేయకుండా నాల్గో పాటని విడుదల చేయాలని చూస్తున్నారు. సినిమాపై బజ్ ఎంతమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడాలని నాల్గవ పాటని వారంలోగా విడుదల చేద్దామని అనుకుంటున్నారు. పాటలన్నీ విడుదల చేసిన తరువాత టీజర్ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

సినిమాలో నాల్గో పాట మంచి మాస్ బీట్ అని అంటున్నారు. మరి ఆ పాట ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్  విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. పోస్టర్ డిజైన్లు కూడా అల్లు అర్జున్ స్వయంగా ఓకే చేస్తున్నాడట. పాటల వీడియోల్లో కూడా సిగ్నేచర్ స్టెప్స్ ఉండేలా చూడమని చెప్పినట్లు తెలుస్తోంది.