Asianet News TeluguAsianet News Telugu

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ఫస్ట్ లుక్,గ్లింప్స్ ..త్రివిక్రమ్ హ్యాండ్ కూడా

గోదారోళ్ళం... తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అనే ఒక డైలాగ్ పెట్టారు. పీరియాడిక్ పొలిటికల్ టచ్ తో తెరకెక్కుతున్న  అంతకుముందు ఇదే సినిమాకు లంకల రత్న అని టైటిల్ ను అనుకున్నారు.

Official Vishwaksen next titled Gangs of Godavari jsp
Author
First Published Jul 31, 2023, 11:04 AM IST


విశ్వక్ సేన్ వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది దాస్ కా ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ ఆ సినిమా ఫలితంతో నిరాశపడలేదు. అప్పుడే మరో సినిమాని రెడీ చేసేస్తున్నాడు . యాక్షన్ కంటెంట్ తో ఈ సారి ఎలాగైనా ఈసారి సాలిడ్ హిట్ అందుకోవాలని విశ్వక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాటల రచయిత నుంచి దర్శకుడుగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. VS11 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ పెట్టి ..ఫస్ట్  లుక్ ,గ్లింప్స్ రిలీజ్ చేసారు. గోదారోళ్ళం... తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అనే ఒక డైలాగ్ పెట్టారు. 

ఈ చిత్రానికి  ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు.  పీరియాడిక్ పొలిటికల్ టచ్ తో తెరకెక్కుతున్న  అంతకుముందు ఇదే సినిమాకు లంకల రత్న అని టైటిల్ ను అనుకున్నారు. అయితే దానికన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ సినిమాకు చాలా యాప్ట్ గా ఉంటుందని భావించిన చిత్ర టీమ్ ఇదే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఊర మాస్ గా ఉండడంతో సినిమా మొత్తం యాక్షన్ పో తో నింపేశారు. ఇప్పుడు ఫిక్స్ చేసిన టైటిల్ చూస్తే హిందీలో అనురాగ్ క‌శ్య‌ప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సేపూర్ గుర్తుకు రాక మాన‌దు. సినిమా కూడా దాన్ని గుర్తుకు చేసేలా రా అండ్ ర‌స్టిక్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. 

1980… ఆ ప్రాంతంలో గోదావ‌రి నేప‌థ్యంలో జ‌రిగే క‌థ ఇది అని తెలుస్తోంది. ఆ పరివాహక ప్రాంతంలో జరిగిన  గ్యాంగ్ వార్స్‌, ముఠా త‌గాదాలు, రౌడీయిజం  చుట్టూ ఈ క‌థ‌ని అల్లినట్లు సమాచారం. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి  యువ‌న్ శంక‌ర్ రాజా స్వ‌రాలు అందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ సినిమాకి  త్రివిక్ర‌మ్ స‌ల‌హాలూ, సూచ‌న‌లూ, స‌పోర్ట్  ఉందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలోనూ ఆయ‌న భాగ‌స్వామ్యం ఉంద‌ని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీలో చేయాల్సిన సినిమా ఇది. అప్ప‌ట్లో శ‌ర్వానంద్ ని హీరోగా అనుకొన్నారు. ఆ త‌ర‌వాత విశ్వ‌క్ చేతికి వ‌చ్చింది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios