హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జెనెగర్‌ నటించిన తాజా చిత్రం టెర్మినేటర్‌ డార్క్‌ ఫేట్‌. నవంబర్‌ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని జేమ్స్‌ కామెరూన్‌  నిర్మించారు. మన దేశంలో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో హీరో విజయ్‌ దేవరకొండ ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ చూస్తూంటే యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉంది.  ఈ ట్రైలర్ లో 63 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో  లిండా హామిల్టన్ మెషీన్ గన్‌లు పట్టుకుని టెర్మినేటర్లను వేటాడటం గమనించవచ్చు.  

ఆమె పేరు సారా కానర్. ఇక ఆర్నాల్డ్ కూడా వయసు మళ్లిన టెర్మినేటర్‌గా కనిపించారు. తెలుగు ట్రైలర్ కు, హాలీవుడ్ ట్రైలర్ కు తేడా ఉండటం గమనించవచ్చు. తెలుగు వెర్షన్ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. హాలీవుడ్‌ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. టెర్మినేటర్‌. ఆ  సిరీస్‌లో వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్‌ చాలా క్రేజ్ ఉంది. 'టెర్మినేటర్ 2 : జడ్జిమెంట్ డే'కు కంటిన్యూషన్‌గా రూపొందుతున్న ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ వస్తుంది.

ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా అలరించనుండగా, 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్ ట్రైలర్ ఇప్పటికే  రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.   ఈ సినిమాలో మెకంజీ డేవిస్, నటాలియా రేయిస్, గాబ్రియేల్ లూనా లతో పాటు యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మరియు లిండా హామిల్టన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  హాలీవుడ్‌లో నవంబర్‌1న, ఇక్కడ నవంబర్‌ 2న విడుదల కానుంది.