టాలీవుడ్ హీరోలు సింగర్స్ గా ఎంత మంచి క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మన హీరోల గాత్రాలకు పక్క ఇండస్ట్రీ హీరోలు కూడా ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో టాప్ లో ఉన్నారని చెప్పవచ్చు. యమదొంగ నుంచి అవసరం ఉన్నప్పుడల్లా ఎన్టీఆర్ తన గాత్రంతో సినిమాలకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు మరొక కోలీవుడ్ స్టార్ హీరో సినిమా కోసం కూడా తారక్ ఒక పాట పాడబోతున్నట్లు సమాచారం. గతంలోనే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఆయన సినిమాలో ఒక పాట పాడాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కోసం కూడా ఎన్టీఆర్ ఒక పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ నెక్స్ట్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల తమిళ్ లో 'కుట్టి స్టోరీ' సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ని తమిళ్ లో విజయ్ పాడగా ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ పాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఆడియెన్స్ కి నచ్చే విధంగా లిరిక్స్ లో మార్పులు చేయనున్నారట. అనిరుద్ సలహా మేరకు విజయ్ ఎన్టీఆర్ ని కలవనున్నాడట. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.