యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్నారని చెప్పగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల ఉగాది కానుకగా విడుదుల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ అదిరిపోయింది. దీనితో అంచనాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఈ చిత్రానికి రౌద్రం రణం రుధిరం అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.  

మోషన్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ పై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ అభిమానులని సర్ ప్రైజ్ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. 450 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళీ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.  

తెలుగులో ఎలాగూ ఎన్టీఆర్, చరణ్ లే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఇతర భాషల్లో వీరికి డబ్బింగ్ చెప్పే సరైన నటుల్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ తో ప్రయోగానికి సిద్ధం అయినట్లు టాక్. 

తెలుగు తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఎన్టీఆర్ తోనే డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. సహజంగానే ఎన్టీఆర్ వాయిస్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పనవసరం లేదు. హిందీ, తమిళంలో ఆల్రెడీ ఎన్టీఆర్ కు ఎంతో కొంత ప్రావీణ్యం ఉంది. దీనితో రాజమౌళి హిందీ, తమిళంలో ఎన్టీఆర్ డబ్బింగ్ చెబితేనే బావుంటుందని భావిస్తున్నారు. సాహో చిత్రం కోసం ప్రభాస్ హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు.