బన్నీ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’.  సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. అలాగే  ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌, ‘సామజవరగమన’సాంగ్‌, పోస్టర్‌ ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేసి మరింతగా సినిమాకు క్రేజ్ తేవాలని టీమ్ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకు వస్తున్నట్లు సమాచారం. గతంలో భరత్ అనే నేను చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరయ్యి తన సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి స్వయంగా ఎన్టీఆర్ ని పిలిచారని , నందమూరి అభిమానులంతా ఈ ఈవెంట్ కు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ సీన్ లోకి వచ్చారో అప్పుడు ఖచ్చితంగా నందమూరి అభిమానుల సపోర్ట్ ‘అల వైకుంఠపురములో..’ కు దక్కుతుంది. ఇక ఎన్టీఆర్ ఏ  రోజు లీజర్ గా దొరుకుతారో ఆ టైమ్ ని చెక్ చేసుకుని ఈ ఈవెంట్ ప్లాన్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి పోటీగా ఈ సినిమా సంక్రాంతి పోటీలో నిలబడనుంది.

యూట్యూబ్ లో లీక్, హీరో ఆత్మహత్య బెదిరింపు!

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురములో’. గతంలో ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి సినిమాలు ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్.

టబు, రాజేంద్రప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఈ నెల 11న అంటే ఈ రోజు రిలీజ్‌ కానుంది. టీజర్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ బోర్డ్‌ మీటింగ్‌ జరుగుతున్న సమయంలో బల్ల ఎక్కి వాక్‌ చేస్తూ అల్లు అర్జున్‌ కనిపించే చిన్న బిట్‌ను రిలీజ్‌ చేసింది టీమ్‌. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.