యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో  రాజమౌళి దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, రాంచరణ్ ని లని స్వాతంత్ర యోధులుగా చూపిస్తూ మరో అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. 

ఇదిలా ఉండగా మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఎన్టీఆర్ అభిమానులైతే భారీ ప్లాన్స్ లోనే ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజుకు 10 రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. 

ఇక టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనివిధంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్ని ఆయన అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ఏకంగా 25 మంది టాలీవుడ్ స్టార్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ చేతులు కలిపారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా 25 మంది సెలెబ్రిటీలు తమ సోషల్  పేజీలలో ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డిస్ ప్లే పిక్చర్(CDP) ని రిలీజ్ చేశారు. 

రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా, మెహ్రీన్ , దేవిశ్రీ , తమన్, హరీష్ శంకర్, జగపతి బాబు, బ్రహ్మజీ, బండ్ల గణేష్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్, నివేదా థామస్, అనుప్ రూబెన్స్, కాలా భైరవ, వంశి పైడిపల్లి, నిధి అగర్వాల్, రుహానీ శర్మ, నాగ శౌర్య, బివిఎస్ఎన్ ప్రసాద్, ఎస్ఎస్ కార్తికేయ, విశ్వక్ సేన్, బాబీ,  హరికా అండ్ హాసిన్, మైత్రి మూవీ మేకర్స్, డివివి మూవీస్, ఎస్విసిసి, సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ వారు ఎన్టీఆర్ CDP ని విడుదల చేశారు. టాలీవుడ్ లోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సృష్టించిన రేర్ రికార్డ్ ఇది.