Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే..!

ఒకవేళ ఆయన చెప్పకపోతే.. గోవా రాకుండా ఆయనపై నిషేధం విధించాలని సీఎం ప్రమోద్ సావంత్ ని కోరింది. గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్ కూడా సల్మాన్ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

NSUI demands apology from Salman Khan for phone-snatching incident
Author
Hyderabad, First Published Jan 29, 2020, 10:01 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ అభిమాని పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించిన తీరు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోవా ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం ఎన్‌ఎస్‌యూఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సల్మాన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఆయన చెప్పకపోతే.. గోవా రాకుండా ఆయనపై నిషేధం విధించాలని సీఎం ప్రమోద్ సావంత్ ని కోరింది.

ఆ ఒక్క సీన్ కోసం 8కోట్లా.. సల్మాన్ రేంజ్ మాములుగా లేదు!

గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర సావైకర్ కూడా సల్మాన్ తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన సినిమా షూటింగ్ కోసం మంగళవారం ఉదయం సల్మాన్ గోవా ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.

డిపార్చర్ గేటు నుండి బయటకి వస్తుండగా.. ఆయన ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన అభిమాని. తన అనుమతి లేకుండా సెల్ఫీలు దిగుతుండడంతో ఆగ్రహానికి లోనైన సల్మాన్ అతడి ఫోన్ లాక్కున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు అభిమాని ఎయిర్ పోర్ట్ లో పని చేసే ఉద్యోగి అని తెలుస్తోంది.   

 

Follow Us:
Download App:
  • android
  • ios