‘కె.జి.ఎఫ్'(సిరీస్) నిర్మాతలైన ‘హోంబలే ఫిలింస్’ వారు రూ.16 కోట్ల బడ్జెట్ తో ‘కాంతార’ ని నిర్మించారు. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దీనికి దర్శకత్వం కూడా వహించడం విశేషం.
రిషబ్‌శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కాంతారా చిత్రం రిలీజైన అన్ని చోట్లా భారీగా వసూళ్లను సొంతం చేసింది. దాదాపు ప్రతీ చోటా ఫస్ట్ డే కలెక్షన్స్‌తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కన్నడంలో సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజైంది. పదిహేను రోజుల్లోనే దాదాపు వంద కోట్లవరకు వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కాంతార కేవలం నెల రోజుల్లో ఏపీ తెలంగాణలో 50 కోట్ల గ్రాస్ దాటేసింది. హిందీలో 75 కోట్లు లాగేసింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే 400 కోట్లకు దగ్గరగా ఉంది. ఇంతా చేసి దీనికి ఖర్చు పెట్టిన బడ్జెట్ 16 కోట్లే. కర్ణాటకలోని ఒక ప్రాంతానికి చెందిన సంప్రదాయాన్ని దేవుడి ఆచారంతో ముడిపెట్టిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా గా ఇప్పటివరకు ఈ మూవీ రూ.365 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ‘కాంతారా’ ఓటిటి, శాటిలైట్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 7,10 రోజుల్లో ‘కాంతార’ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరో ప్రక్క ఈ చిత్రం తెలుగు శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. అలాగే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కాంతార’ శాటిలైట్ హక్కులను స్టార్ మా వారు దక్కించుకున్నారట. ఈ చిత్రాన్ని వారు రూ.4.5 కోట్ల ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు దాదాపు 10 వరకు టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యాలి. ఈ మధ్యకాలంలో థియేటర్లలో లాంగ్ రన్ నడిచిన ఏ సినిమాలకు బుల్లితెర పై ఆశించిన రేంజ్లో టి.ఆర్.పి నమోదు కావడం లేదు. మొన్నటికి మొన్న థియేటర్ లో పెద్ద హిట్టైన విక్రమ్ సినిమా కూడా టీవీలలో వర్కవుట్ కాలేదు అన్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగించిన ‘కాంతార’ బుల్లితెర పై ఎలాంటి అద్భుతం చేస్తుందో అని ట్రేడ్ ఎదురుచూస్తోంది.
