దమ్మున్న సినిమా పడితే సీజన్, అన్ సీజన్ లేకుండా కుమ్మేస్తుంది. అందుకు ఉదాహరణ సాయి తేజ్‌, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పకుడుగా బన్నీ వాస్‌ నిర్మాత గా రూపొందిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ముఖ్యంగా ఈ స్దాయి సినిమా ఒకటి కూడా మార్కెట్లో రిలీజ్ కాకపోవటం ప్లస్ అయ్యింది.

ఈ సినిమాతో పాటు రిలీజైన బాలయ్య చిత్రం రూలర్ డిజాస్టర్ కావటం ప్లస్ అయ్యింది. అలాగే క్రిస్మస్ సందర్బంగా రిలీజైన ఇద్దరి లోకం ఒకటే, మత్తు వదలరా చిత్రాలు రెండూ ఈ సినిమాకు పోటీ కాలేకపోయాయి. అంతేకాకుండా జనవరి ఫస్ట్ సందర్బంగా రిలీజైన అతడే శ్రీమన్నారాయణ, బ్యూటీఫుల్ చిత్రాలు సైతం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదని తేలిపోయింది.

దాంతో సంక్రాతికి రానున్న పెద్ద సినిమాల దాకా ఈ సినిమా రన్ కు అడ్డే లేకుండా పోయింది.    సాయి తేజ్‌ మాట్లాడుతూ ‘‘కథ వినగానే వదులుకోకూడదు అనిపించింది. మారుతిగారి గత సినిమాల్లో హీరో పాత్రకి అరుదైన వ్యాధులు ఉండేవి. ఇందులో అతి మంచితనమే హీరోకున్న డిజార్డర్‌. ఆరు నుండి అరవై ఏళ్ల వయసు వరకూ అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది’’ అన్నారు.  ‘తేజ్‌తో మా బ్యానర్‌లో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం.

ఇప్పటికి కుదిరింది. ‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత మారుతితో చేస్తున్న సినిమా ఇది. సందేశాన్ని సరదాగా చెప్పే నేర్పరితనం మారుతిలో ఉంది. ఎన్‌ఆర్‌ఐల కథ ఇది. ఈ సినిమా చూశాక వారిలో కొందరు ఆనందపడితే, ఇంకొందరు బాధపడతారు. ఇక్కడి వారితో కనెక్ట్‌ కాలేక ఎన్నారైలు ఎలా బాధపడుతున్నారన్నది ఇందులో కీలక అంశం’’ అని అల్లు అరవింద్‌ అన్నారు.  ‘‘సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. అన్ని అంశాలు కలగలిసిన ఫుల్‌ మీల్స్‌ ఇది. అరవింద్‌గారి బ్యానర్‌లో ‘విజేత’లాంటి సినిమా అవ్వాలని బాధ్యతగా తీశాం’’ అని మారుతి చెప్పారు.