ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 రూపాయలు గా , మల్టీప్లెక్స్ థియేటర్ లో 177 రూపాయలుగా ఉండునట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను తక్కువ టికెట్ ధరలకే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ''హ్యాపీ బర్త్‌ డే'' ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్‌, దర్శకుడు రితేష్‌ రానా రూపొందించారు. ఈ చిత్రాన్ని క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించింది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ థ్రిల్లింగ్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ ని రేట్లు తగ్గించి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

 ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 రూపాయలు గా , మల్టీప్లెక్స్ థియేటర్ లో 177 రూపాయలుగా ఉండునట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను తక్కువ టికెట్ ధరలకే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ టిక్కెట్ ధరలు తగ్గింపు ఇంపాక్ట్ ...బుక్కింగ్స్ మీద ఏ మేరకు ఉందో చూస్తే.... పెద్దగా లేదనే చెప్పాలి. ఎక్కడా యాభై శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించడం లేదు. 

ఈ తగ్గింపు రేట్లు తెలంగాణాకే పరిమితం కావటం , ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాత రేట్లే ఉండటంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇలాంటి రేట్లు తక్కువ స్ట్రాటజీ కాస్త ఇమేజ్ ఉన్న హీరోలకే వర్కవుట్ అవుతుందంటున్నారు. లావణ్య త్రిపాఠి ఎంత వరకూ జనాలను థియోటర్స్ పుల్ చేస్తుందనేదానిపై ఓపినింగ్స్, బుక్కింగ్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలకు మౌత్ టౌక్ బాగా ప్లస్ అవుతుంది. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి గన్ ఉంటె ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నరేష్‌ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌, గుండు సుదర్శన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ వైవిధ్యంగా ఉండి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తున్న లీడ్‌ క్యారెక్టర్స్‌ కూడా సరికొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నాయి.