. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘విక్రమ్’ జూన్ 3న విడుదల కానుంది. అలాగే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం కమల్ అభిమానులు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘విక్రమ్’. కమల్ తోపాటు ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘విక్రమ్’ జూన్ 3న విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన `విక్రమ్` ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం కమల్ అభిమానులు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు తమిళంలో తప్ప మిగతా చోట్ల అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కావటం లేదు. ముఖ్యంగా ఈ సినిమాను హిందీలోనూ భారీగా రిలీజ్ పెట్టారు. కానీ బజ్ క్రియేట్ కాకపోవటంతో అక్కడ థియేటర్స్ సైతం దొరకటం లేదని సమాచారం.
ఈ సినిమాపై కమల్ హాసన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ విషయం మనం గత కొన్ని రోజులుగా విక్రమ్‌ను దూకుడుగా ప్రమోట్ చేయటంతో గమనించవచ్చు. ఈ సినిమాతో సౌత్ లో దీనికి మంచి బజ్ సృష్టించే ప్రయత్నంచేసారు. కానీ హిందీలో మార్కెట్ లో వాళ్ల వల్ల కాలేదు. కమల్ ట్రైలర్ లాంచ్ చేసి, కపిల్ శర్మ షో వంటి షోలలో సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్ళినప్పటికీ, హిందీ బెల్ట్‌లో లోకేష్ కనగరాజ్ చిత్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు.
రేపు జూన్ 3న విడుదల కానున్న అక్షయ్ కుమార్ సామ్రాట్ `పృథ్వీరాజ్` పైనే హిందీ ప్రేక్షకుల దృష్టి అంతా ఉంది. మరో ప్రక్క అడివి శేష్ కూడా మేజర్‌తో హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. తన ప్రమోషన్స్..ముందస్దు ప్రివ్యూలతో అదే రోజు విడుదలయ్యే తన చిత్రంపై కూడా కొంత అటెన్షన్ ని క్రియేట్ చేయగలిగాడు. అయితే తమిళ పాన్-ఇండియా చిత్రంగా చెప్పబడుతున్న `విక్రమ్` కు స్క్రీన్స్ దొరకలేదు, ఎందుకంటే వాటిలో ఎక్కువ భాగం `మేజర్` మరియు `పృథ్వీరాజ్`లకు ఇచ్చేశారు. మిగతా రెండు చిత్రాలతో పోల్చితే విక్రమ్‌కు స్క్రీన్‌లు అందుబాటులో లేకపోవడంతో చాలా డల్ గా స్టార్ట్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక తెలుగులో ఈ చిత్రం తెలుగు రైట్స్ ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్ తెలుగు హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుంటే.. మన హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి భయపడేవారు. రాను రాను తెలుగులో కమల్ హాసన్ మార్కెట్ దారుణంగా పడిపోయిందనే చెప్పాలి. కానీ లోకేష్ కనగరాజ్‌కు గత రెండు సినిమాలు ‘ఖైదీ’, ’మాస్టర్’ తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఇపుడు ఈ సినిమా తెలుగు హక్కులకు భారీ రేటు దక్కినట్టు చెబుతున్నారు.
`విక్రమ్` చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ అందిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
