తమిళంలో హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌ లో వచ్చిన 'అసురన్' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వారంలోపే ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కొనుగోలు చేశారు. 

తన సోదరుడు వెంకటేష్‌ను హీరోగా పెట్టి ఈ సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్, ఓంకార్ లను అనుకున్నారు. కానీ శ్రీకాంత్ అడ్డాలని దర్శకుడిగా ఫైనల్ చేసుకున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని సమాచారం. 

అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ మాస్ రివెంజ్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆసక్తి పెరిగిపోతోంది. 'బ్రహ్మోత్సవం; డిజాస్టర్ కావడంతో మూడేళ్లుగా అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు 'అసురన్' రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం విశేషమే..

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ని రెండు సార్లు డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు పారితోషికం నెలవారీ జీతంగా తీసుకుంటున్నాడని సమాచారం. 'అసురన్' రీమేక్ కోసం నిర్మాత సురేష్ బాబు ఇచ్చిన బడ్జెట్ రూ.13 కోట్లు.. ఈ మొత్తంలోనే సినిమాను పూర్తి చేయాల్సివుంటుంది. సొంత బ్యానర్ కాబట్టి హీరో వెంకటేష్ కి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదట.

వచ్చే లాభాల్లో వెంకీ వాటా తీసుకుంటారట. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి నెలకి రూ.2 లక్షల చొప్పున జీతం మాదిరి రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. సినిమాకి మంచి లాభాలు వస్తే గనుక అప్పుడు శ్రీకాంత్ అడ్డాలకి మరికొంత మొత్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. 

ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న ఈ దర్శకుడు మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' దెబ్బకి నెలవారి జీతం తీసుకునే స్థాయికి పడిపోయాడు. ఈ సినిమా అయినా సక్సెస్ అయితే శ్రీకాంత్ అడ్డాలకి దర్శకుడిగా అవకాశాలు పెరుగుతాయి.