టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజుకో వార్త సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. పింక్ రీమేక్ అని దాదాపు ఫిక్స్ చేశారు. దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.

ఇక ప్రాజెక్ట్ కి సంబందించిన రెమ్యునరేషన్స్ రూమర్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.  గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా వేరే విధంగా లాభాల్ని అందుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆదాయం లేని సమయంలో సినిమా చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్న పవన్ కి నిర్మాతలు ఇచ్చిన సలహాతో షేర్స్ అందుకోవడానికి డిసైడ్ అయ్యారట.

ఏదైనా ఒక దారిలో సినిమాకు వచ్చిన లాభాల్ని అందుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారట. నిర్మాత దిల్ రాజు కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.  ఇక సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమెను బోణి కపూర్ నిర్ణయంతో మెయిన్ లీడ్ కి సెలెక్ట్ చేశారట.

బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకున్న పింక్ సినిమాలో అమితాబ్ - తాప్సి నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల కోలీవుడ్ లో అజిత్ చేత రీమేక్ చేయించిన బోణి కపూర్ సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ తో చేస్తున్న పింక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.