Asianet News TeluguAsianet News Telugu

#SGR:ప్చ్ ..చేతులారా చంపేసుకున్న సినిమా

సినిమాకి పబ్లిసిటీ లేక ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. చూసిన వాళ్లు బాగుందంటున్నారు. కానీ భాక్సాఫీస్ దగ్గర ఫలితం లేదు. ఆ సినిమానే సకల గుణాభిరామ. మంచి సినిమా అని తెలిసేలోగా మాయమైపోయింది అని కొందరు చూసిన వారు సోషల్ మీడియాలో నిట్టూరుస్తున్నారు.

No Publicity for Sakala Gunabhi Rama movie
Author
First Published Sep 24, 2022, 5:07 PM IST


పెద్ద సినిమాలు తప్పించి,చిన్న సినిమాలు ప్రస్తుత ట్రెండ్ లో మన్నగలగటం కష్టంగా ఉంది. సినిమా తీయటం దాకానే నిర్మాతలు చూసుకుంటున్నారు. కానీ దాన్ని ప్రోపర్ గా పబ్లిసిటీ చేసి జనాల్లోకి తీసుకెళ్లటం కొత్త నిర్మాతలు  తమ భాధ్యతగా ఫీలవటం లేదు.  దాంతో ఫలానా సినిమా ఉంది అని ప్రేక్షకుడుకి తెలిసి, థియేటర్ లిస్ట్ వెతుక్కునే లోగా అది మాయమైపోతోంది. టాక్ రావటమే ఈ రోజున ప్రతీ సినిమాకి పెద్ద సమస్య.

అందులోనూ కోవిడ్ తర్వాత సినిమాల రిలీజ్ లు పెరిగిపోయాయి. ఒక్కో వారం పదిహేను సినిమాలు దాకా రిలీజ్ అవుతున్న పరిస్దితి. దాంతో అసలు ఏ సినిమా రిలీజ్ అవుతోంది. ఎవరు హీరోనో, డైరక్టరో, అసలు సినిమా ఎలా ఉందో తెలియటం లేదు. సినిమా బాగుందని ఎవరో ఒకరు చూసి చెప్తే థియేటర్ లో ఉండదు. సర్లే ఓటీటీలోనో లేక టీవిలోనో చూద్దామనుకునే పరిస్దితి ప్రేక్షకుడుది. అలాంటి సినిమానే క్రిందటి వారం రిలీజైంది. ఆ సినిమాకి పబ్లిసిటీ లేక ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. చూసిన వాళ్లు బాగుందంటున్నారు. కానీ భాక్సాఫీస్ దగ్గర ఫలితం లేదు. ఆ సినిమానే సకల గుణాభిరామ. మంచి సినిమా అని తెలిసేలోగా మాయమైపోయింది అని కొందరు చూసిన వారు సోషల్ మీడియాలో నిట్టూరుస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ హీరోగా నటించిన సినిమా సకల గుణాభి రామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. సన్నీ హీరోగా నటించిన మొదటి సినిమా కావడంతో.. దీనిపై ఇంట్రస్ట్ గానే ఉన్నారు ఆడియన్స్. అయితే సినిమా రిలీజైందనే విషయం చాలా మందికి తెలియని పరిస్దితి. ఈ చిన్న సినిమాను సోషల్ మీడియాలోనూ ఎవరూ ప్రమోట్ చేయలేదు. బయిటా పబ్లిసిటీ లేదు. 

ఈ సినిమా..ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ చుట్టు తిరుగుతుంది. అతని  జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా కథ. పైకి చూడ్డానికి సరదాగా ఫన్నీగా సాగిపోతుంది ఈ కథ. ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా సరిగ్గా ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్.వాటిని అంతే ఎమోషనల్ గా, ఫన్నీగా తెరకెక్కించాడు. సరదాగా సాగిపోయే  సన్నివేశాల నేపథ్యంలో సాగిపోతుంది కథ. అక్కడి సహా ఉద్యోగులతో, యజమానితో సరదా సరదా సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ తర్వాత పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది.. దాని వల్ల నేర్చుకునే గుణపాఠం లాంటివి చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. 

ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు.. ఏవైనా పొరపాట్లు జరిగితే.. వాటిని క్షమించే క్షమాగుణం కూడా భార్యా భర్తలకు ఉండాలి. అప్పుడే అలాంటి బంధాలు సొసైటీలో చాలా బలంగా వుంటాయి అనే ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే మరింతగా జనాల్లోకి తీసి కెళ్లి ఉంటే బాగుండేది. పైగా చిన్న ఆర్టిస్టులు ఉండటం.. సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా సకల గుణాభి రామకు మైనస్‌గా మారింది. చూసిన వారు దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ రాసుకున్నాడు కానీ ఎందుకు హిట్ అవలేదో అని ఆశ్చర్యపోతున్నారు..  కాస్త పబ్లిసిటీ చేసి ఉంటే  .. కచ్చితంగా మంచి హిట్  సినిమా అయ్యుండేది.

Follow Us:
Download App:
  • android
  • ios