ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ బడ్జెట్ మరీ ఎక్కువ అనిపించటంతో రికవరీ అవదని ఆయన సైడ్ అయ్యిపోయారు.


విజయ్ స్టార్ హీరో సినిమా నిర్మించటానికి ప్రొడ్యూసర్ దొరకటం లేదనేది ఎప్పుడూ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే ఇది నిజం. తమిళ స్టార్ హీరో విజయ్‌, దర్శకుడు వెంకట్‌ప్రభు కలయికలో ‘గోట్‌’ చిత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. ఇదయ్యాక ఆయన పూర్తిస్థాయిలో తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని ఆ మధ్యే వార్తలు వచ్చాయి. అయితే విజయ్‌ మనసు మార్చుకొని, హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో చివరిగా తన 69వ చిత్రం చేయనున్నారనే కొత్త కబురు తాజాగా వినిపించింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న విజయ్‌ 69వ చిత్రం కోసం దర్శకులు కార్తీక్‌ సుబ్బరాజ్‌, ఆర్జే బాలాజీ, హెచ్‌ వినోద్‌లు సంప్రదించారు. 

చివరకు హెచ్‌ వినోద్‌ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారు . ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ బడ్జెట్ మరీ ఎక్కువ అనిపించటంతో రికవరీ అవదని ఆయన సైడ్ అయ్యిపోయారు. తమిళ ప్రొడక్షన్ హౌస్ KVN ప్రొడక్షన్స్ తో చర్చలు జరిగాయి కానీ ఫైనల్ కాలేదు. మిగతా నిర్మాతలు ఎవరూ ఉత్సాహం చూపటం లేదు. 

అందుకు కారణం హెచ్ వినోద్ కు ఇండిడ్యువల్ మార్కెట్ లేదు. సెపరేట్ ట్రాక్ రికార్డ్ లేదు. లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ మాదిరిగా పెద్ద హిట్స్ ఇచ్చి ఉంటే డైరక్టర్ వైపు నుంచి కూడా బజ్ క్రియేట్ అవుతుంది. కానీ హెచ్ వినోద్ దర్శకుడిగా అజిత్ తో ఎక్కువ సినిమాలు తీశారు. తునివు, వాలిమై, అంతకు ముందు నేర్కొండ పార్వై సినిమాకి ఆయన అజిత్ తో పని చేశారు. ఈ సినిమాలన్నీ అజిత్ క్రేజ్ మీద ఎక్కువ శాతం కొట్టుకుపోయినవే. 

దాంతో ఇప్పుడు విజయ్ తో సినిమా అన్న వార్త పెద్దగా ట్రేడ్ లో కిక్ ఇవ్వటం లేదు. నెల్సన్ ని నమ్మి విజయ్ సినిమా ఇస్తే బీస్ట్ అనే డిజాస్టర్ ఇచ్చారు. అది ఒక భయానికి కారణం. ఇవన్నీ లెక్కేసుకుని నిర్మాతలు ఎవరూ ముందుకు రావటం లేదు. డైరక్టర్ ని మారిస్తే నిర్మాత దొరుకుతాడని అంటున్నారు. అయితే హెచ్ వినోద్ తో చేస్తానని విజయ్ మాట ఇచ్చారని, మాట తప్పటం ఇష్టం లేదంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే ‘రాజకీయాలంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు.. త్యాగం. నా సీనియర్ల బాటలో నడుస్తూ అందులోని లోతుపాతులు తెలుసుకుంటున్నాను. ఎప్పట్నోంచో దీనికోసం మానసికంగా సిద్ధమవుతున్నాను. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారడానికి ముందు మరో చిత్రంలో నటించాలనుకుంటున్నాను’ అంటూ విజయ్‌ ఒక ప్రకటన విడుదల చేయడంతో ఈ కొత్త సినిమా వార్తలకు బలం చేకూరినట్టైంది.