న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం రూలర్.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం  డిసెంబర్ 20 న విడుదల చేయటానికి నిర్ణయించారు.  యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా గా రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే ప్రారంభమైంది.

అయితే మీడియాలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చిందని ప్రచారం జరుగుతున్నా..ట్రేడ్ లో మాత్రం ఆ వేడి కనపడటం లేదని సమాచారం. బయ్యర్లు ఎవరూ ఉత్సాహంగా ముందుకు రావటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఒకప్పుడు బాలయ్య సినిమా అంటే హాట్ కేకులా అమ్ముడయ్యే ఏరియాల్లో కూడా అదే పరిస్దితి నెలకొనటం నిర్మాతకు షాక్ ఇస్తోందంటున్నారు.

సాధారణంగా బాలయ్య సినిమాలు భారీ రికార్డ్ రికార్డ్  రేటులకు అమ్ముడుపోవు కానీ డీసెంట్ బిజినెస్ జరుగుతూంటుంది. అయితే ఈ సంవత్సరం రిలీజైన బాలయ్య రెండు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో ఈ సినిమాపై గట్టి ప్రభావమే చూపిస్తోందని వినికిడి.  అందుతున్న సమాచారం మేరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ పంపిణీదారులు ఉషా పిక్చర్స్ వారు తీసుకున్నారు. అలాగే నైజం ఏరియాకు ఏషియన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నారంటున్నారు. మిగతా ఏరియాలకు బిజినెస్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి.  

మరీ ముఖ్యంగా ఓవర్ సీస్ నుంచి ఎవరూ ఉత్సాహంగా బిజినెస్ కు సంప్రదించలేదంటున్నారు. ఈ పాటికి ఓవర్ సీస్ బిజినెస్ సాధారణంగా కంప్లీట్ అయిపోతుంది. కానీ కదిలక లేదంటున్నారు. ఉన్నంతలో జెమెనీ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకోవటం ఊరట.

ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తుండ‌గా రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్‌లక్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. చిన్నా ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.  సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 18 నుంచి రామోజీ ఫిలింసిటీలో కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది.