టాలీవుడ్ లో సినిమా సందడికి బ్రేక్ పడి ఐదు నెలలు అవుతుంది. మార్చిలో మూతపడిన చిత్ర పరిశ్రమ ఇంత వరకు తిరిగి ప్రారంభం కాలేదు. థియేటర్స్ బంధ్ కావడంతో పూర్తి అయిన చిత్రాల విడుదల ఆగిపోయింది. అనేక చిత్రాల షూటింగ్స్ మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే అన్ని పరిశ్రమలు షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తున్నాయి. బాలీవుడ్, శాండిల్ వుడ్ మరియు కోలీవుడ్ లో చిత్రాల షూటింగ్స్ మొదలుపెట్టారు. ఈ విషయంలో టాలీవుడ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

ఐతే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం సెప్టెంబర్ 2నుండి రాధే శ్యామ్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు. షూటింగ్ లొకేషన్ పై అవగాహన లేకున్నప్పటికీ చిత్ర యూనిట్ మొత్తం పాల్గొననున్నారని సమాచారం . హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఈ షెడ్యూల్ నందు పాల్గొననుంది. 

కాగా టాలీవుడ్ యంగ్ హీరోలలో ప్రభాస్ మాత్రమే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలపడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న చరణ్, ఎన్టీఆర్ కానీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేస్తున్న అల్లు అర్జున్ కానీ తమ షూటింగ్స్ పై అప్డేట్ ఇవ్వలేదు. అలాగే మహేష్ దర్శకుడు పరుశురామ్ తో సర్కారు వారి పాట మూవీ చేస్తుండగా ఆయన కూడా షూటింగ్ పై ప్రకనట చేయలేదు. దీనితో సదరు హీరోల ఫ్యాన్స్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు వయసురీత్యా ఇంకొంత గ్యాప్ తీసుకోనున్నారని సమాచారం.