ఒకానొక సమయంలో వరుస పరాజయాలతో కుంగిపోయిన మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ మళ్లీ పుంజుకుంటాడా..? అనే సందేహాలు కలిగేవి. అలాంటిది ఈ ఏడాదిలో రెండు సక్సెస్ లతో తన సత్తా చాటాడు.

'చిత్రలహరి' సినిమాతో ఓకే అనిపించుకున్న సాయి తేజ్.. రీసెంట్ గా 'ప్రతిరోజు పండగే' చిత్రంతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాయి తేజ్ లో మరింత ఆనందాన్ని నింపింది.

దీంతో 2020లో సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్', దేవకట్టా చిత్రాలతో తన విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. 'ప్రతిరోజూ పండగే'తో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కి బ్రేక్ వేయగలిగాడు. తమన్ తో తాను పని చేసిన అంతకుముందు చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

వైరల్ : ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన దిశా పటానీ!

నాలుగు ఫ్లాప్ సినిమాలతో తమన్ ని తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ మారుతికి తమన్ బాగా ట్యూన్ అవ్వడంతో 'ప్రతిరోజూ పండగే['కి అతనే పాటలు చేశాడు. సినిమా కూడా హిట్టవ్వడంతో ఈ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది.

దీంతో సాయి తేజ్ తన తదుపరి సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'కి కూడా తమన్ నే ఫిక్స్ చేసుకున్నారు. 'ప్రతిరోజూ పండగే' హిట్ అవ్వడంతో తన నెక్స్ట్ సినిమాకి కూడా తమన్ ని కన్ఫర్మ్ చేశారు. దేవకట్టా సినిమాకి కూడా తమన్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.