Asianet News TeluguAsianet News Telugu

#LSC:కలెక్షన్స్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఈ సినిమా మీద రకరకాల కారణాల వల్ల నెలకొన్న నెగెటివిటీ వల్ల విడుదలకు ముందే ఇది డిజాస్టర్ అనిపించింది. . దీనికి తోడు మార్నింగ్ షోకే  బ్యాడ్ టాక్ రావడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. తొలి రోజు ఈ చిత్రానికి జనాలు లేక 1300 షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

No Money Is Lost:  Laal Singh Chaddha Producers
Author
Mumbai, First Published Aug 16, 2022, 5:35 PM IST


బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా (Lal Singh Chadda). టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా భావించి దేశం మొత్తం తిరిగి ప్రమోట్ చేసారు. అయినా రిజల్ట్ దారుణంగా ఉంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో కేవలం 38 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తేలింది. డిస్ట్రిబ్యూటర్స్ కాంపన్సేట్ చేయమని ఒత్తిడి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాతలలో ఒకరైన వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థ చీఫ్ అజిత్ స్పందించారు.

ఈ సినిమాకు అసలు బయటనుంచి డిస్ట్రిబ్యూటర్స్ లేరు. వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. అలాగే మేము డబ్బులు పోగొట్టుకున్నదేమీ లేదు. ఇప్పటికీ అన్నిచోట్లా ఈ సినిమా నడూుస్తోంది. ఇండియాలోనూ, ఇంటర్నేషనల్ గానూ కలెక్షన్స్ వస్తున్నాయి. మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమే అని అన్నారు. 

అద్వైత్ చందన్ (Adhvaith Chandan) దర్శకత్వం వహించిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. నాగచైతన్య ఇందులో బోడి బాలరాజు అనే పాత్రను పోషించారు.  

ఈ కథ లాల్ సింగ్ చద్దా(అమీర్ ఖాన్)  తనేంటో తాను తెలుసుకునే సెల్ఫ్ డిస్కవరీ ప్రయాణం. తన జీవితంలో ఎన్నో కష్ట,నష్టాలు, అవమానాలు ఎదుర్కొని విజేతగా నిలిచిన కథ ఇది. ఐక్యూ తక్కువ ఉన్న కుర్రాడు కావటం, వెన్నుముక బలం లేక నడవలేని తనం వంటివి చాలా బాధిస్తాయి. కానీ తన తల్లి,తన స్నేహితురాలు ప్రియ (కరీనా కపూర్) సాయింతో వాటిని జయిస్తాడు. అయితే తనకు అండగా నిలబడ్డ రూప...లాల్ కు జీవిత సహచారిణి అవుతుందా..మధ్యలో పరిచయం అయిన బాలరాజు (నాగచైతన్య) ఎవరు...అతనితో జర్నీతో లాల్ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి....చివరకు లాల్ తన జీవితంలో ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.
 
ఈ చిత్రం హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను బేస్ చేసుకుని తెర‌కెక్కించారు.  అమీర్‌కు జోడీగా క‌రినా క‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. వయాక‌మ్18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. గ‌తంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల తేదీ వాయిదా పడుతూ వ‌చ్చింది. కాగా ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల అయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios