సంక్రాంతి హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ  టాక్లివుడ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు - అల్లు అర్జున్ సినిమాలు ఒకేరోజు బాక్స్ ఆఫీస్ యుద్దానికి దిగాయి. సరిలేరు నీకెవ్వరు - అల.. వైకుంఠపురములో.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇకపోతే వీరితో పోటీ పడేందుకు కళ్యాణ్ రామ్ కూడా తన సినిమాను రెడీ చేస్తున్నాడు.  సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా! సినిమా జనవరి 15న రిలీజ్ కాబోతోంది. సినిమా పోటీలో ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనే సందేహాలు రోజుకోటి పుట్టుకొస్తున్నాయి. పైగా సినిమా ప్రమోషన్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి.

ఇటీవల ఒక సాంగ్ ని రిలీజ్ చేసినప్పటికీ ఆ సాంగ్ రిలీజ్ అయిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. అంటే.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో నడుస్తుందో చెప్పుకోవచ్చు.  ఓ వైపు మహేష్ - అల్లు అర్జున్ సాంగ్స్ తో యూ ట్యూబ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కానీ నందమూరి హీరో మాత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయడం లేదు.

సినిమాకు సంక్రాంతి మూమెంట్ లో ఎన్ని థియేటర్స్ ఇస్తారో తెలియదు. 300ల థియేటర్స్ దక్కడం కూడా అనుమానంగానే ఉందట. ఉన్న థియేటర్స్ లో వేలకు పైగా అల్లు అర్జున్ - మహేష్ సినిమాలకు దక్కనున్నాయి. దిల్ రాజు - అల్లు అరవింద్ కాబట్టి వారి సినిమాలకే ఎక్కువ స్క్రీన్స్ దక్కుతాయి. ఈ క్రమంలో ఎంత మంచివాడవురా! కి చాలా తక్కువ థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. పైగా ప్రమోషన్స్ లేవు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.