టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ముఖ్యంగా తన సినిమాల్లో కీ రోల్స్ చేస్తుంటాడు. ప్రస్తుతం తను డైరెక్ట్ చేసిన 'ఆవిరి' సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇందులో రవిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రవిబాబు ఓ ఇంటర్వ్యూలో 
పాల్గొన్నాడు.

ఇందులో తనకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో ఓ నటితో రవిబాబు చాట్ చేశాడని.. ఆమెని శారీరకంగా హింసించాడని వార్తలు వచ్చాయి. ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తలు ప్రచురించాయి. ఈ విషయంపై స్పందించిన రవిబాబు ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తనకు అసలు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవని, ఏ విషయం గురించీ మాట్లాడనని.. తన పేరు మీద ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లు అని చెప్పారు.

పదిహేను రోజుల క్రితం తన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఫోన్ చేసి 'సర్ మీరు ఎవరో అమ్మాయిని శారీరకంగా హింసించారని రెండు వెబ్ సైట్స్ తో మాట్లాడింది' అని లింక్ పంపించాడని చెప్పారు రవిబాబు. ఆ వీడియోలో తను ఫేస్ బుక్ లో ఆమెతో అసభ్యంగా చాట్ చేసినట్లు చూపించారని.. ఎవడో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాడని.. అవన్నీ అందులో చూపించారని అన్నారు. 

ఈ ఘటన 2012లో జరిగిందట. తను 'నువ్విలా' సినిమాలో చిన్న పాత్ర చేసిందట. ఆ తరువాత జర్నలిస్ట్ కి ఫోన్ చేసి 'అది నా ఫేస్ బుక్ అకౌంటో కాదో.. తెలియకుండా ఎలా మాట్లాడతారు' అని అడిగినట్లు రవిబాబు చెప్పారు. సాధారణంగా అయితే వారిపై చర్యలు తీసుకోవాలి కానీ వదిలేశానని చెప్పారు. తన తండ్రి విషయంలో కూడా అదే జరిగిందనీ.. ఏదో ఆడియో ఫంక్షన్ లో నోరు జారారని, అది వైరల్ అయి పెద్ద గొడవ అయిందని.. దీనిపై తను ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. కానీ తన పేరు చెప్పి ఏవేవో పోస్ట్ లు పెట్టారని వాటిల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

సినిమాలు తీసే విషయంలో టెక్నాలజీ పెరగడం మంచి విషయమేనని.. కానీ సోషల్ మీడియా చాలా చెడ్డదని తా అభిప్రాయాన్ని చెప్పారు. అది మన జీవితాలను ఆక్రమించిందని.. అందుకే తనకు సోషల్ మీడియా ఖాతాలు లేవని.. ఒక్క ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఉందని చెప్పారు.