ఈ ఏడాది సంక్రాంతి అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న బన్నీ తరువాత సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమాను ప్రారంభించాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఫుల్ మాస్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సూపర్బ్ రెస్సాన్స్‌ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాను బన్నీ కెరీర్‌లోనే తొలిసారిగా పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇతర భాషా నటులను కూడా తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఓ ప్రముక బాలీవుడ్‌ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

ఓ కీలకపాత్రకు తమిళ నటుడు విజయ్‌ సేతుపతిని తీసుకోవాలని ప్రయత్నించినా డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో బహు భాషా నటి నివేదా థామస్‌ నటించనుందట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.