ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నా.. నివేదా పేతురాజ్‌కు హీరోయిన్‌గా బ్రేక్ మాత్రం రాలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. స్టార్ హీరోయిన్‌ల సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితమవుతోంది. దీంతో బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెపుతోంది ఈ బ్యూటీ.
కరోన ఎఫెక్ట్ సినీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే మీడియా సంస్థలకు ఇంటర్య్వూలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడిస్తున్నారు. తాజాగా డస్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ ఓ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నా.. ఈ భామకు హీరోయిన్‌గా బ్రేక్ మాత్రం రాలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. స్టార్ హీరోయిన్‌ల సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితమవుతోంది. దీంతో బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెపుతోంది ఈ బ్యూటీ. అంతేకాదు ఇప్పటి వరకు తన అన్ని సినిమాల్లో హుందాగానే కనిపించటంపై కూడా స్పందించింది నివేదా.
దర్శక నిర్మాతలు తనకు గ్లామర్ రోల్స్ ఇవ్వటం లేదని బాల్‌ను వాళ్ల కోర్ట్‌లోకి నెట్టేసింది. అవకాశం వస్తే స్కిన్ షోకు తాను రెడీ అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. అల వైకుంఠపురములో సినిమాలో మోడ్రన్ గా కనిపించిన అది కూడా గ్లామరస్ రోల్ కాదని ఒకవేళ అలాంటి అవకాశం వస్తే చేసేందుకు తాను రెడీ అంటూ చెప్పేసింది. మరి నివేదా ఆఫర్‌ను దర్శక నిర్మాతలు పట్టించుకొని గ్లామర్ రోల్స్ ఆఫర్ చేస్తారేమో చూడాలి.
