ప్రస్తుతం దేశమంతా జయలలిత బయోపిక్ కి సంబందించిన చిత్రాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరికీ వారు వరుస ఎనౌన్స్మెంట్స్ తో అమ్మ బయోపిక్ లకు మంచి బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందరికంటే హై లెవెల్లో కంగనా జయ బయోపిక్  ని గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది. ఇటీవల తైలవి టీజర్ వదిలి షాకిచ్చిన అమ్మడు అమ్మ పాత్రను తెరపై ఆవిష్కరించినట్లు అర్ధమవుతోంది.

ఇక మరోవైపు నిత్యా మీనన్ జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే సినిమాలో రాజకీయా వివాదాలు అలాగే జయ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఘటనలు ఎక్కువగా  కనిపించవని కామెంట్స్ వచ్చాయి.  అలాగే పలు రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించడంతో సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదనే రూమర్స్ కూడా ఎక్కువవడంతో ఫైనల్ గా నిత్యా మీనన్ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చింది.

సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేశాయని దాదాపు అన్ని నిజాలే కథలో కనిపిస్తాయని చెప్పింది. అదే విధంగా రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు ప్రియదర్శి అలాగే మిగతా టెక్నీషియన్స్ రెడీ అవుతున్నారని వివరణ ఇచ్చారు.  రీసెంట్ గా నిత్యా మరో షాకింగ్ కామెంట్ కూడా చేసింది. జయలలిత బయోపిక్ కి తాను మాత్రమే కరెక్ట్ గా సెట్టవుతానని ఇన్ డైరెక్ట్ గా కంగనాకు మిగతా నటీనటులకు కౌంటర్ ఇచ్చింది.

కంగనా పేరు ప్రస్తావించకపోయినా ఆమె టీజర్ విడుదలైనప్పుడే ఇలాంటి కామెంట్ చేయడం కాంట్రవర్సీగా మారుతోంది. బాలీవుడ్ బడా తారలనే ఒక రేంజ్ లో ఆడుకున్న కంగనాకు నిత్యా మీనన్ కి కౌంటర్ ఇవ్వడం పెద్ద పనేమీ కాదు. మరి ఈ మ్యాటర్ పై ఆమె ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.