Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రస్టింగ్: 'స్కై లాబ్' లో నిత్యామీనన్,సత్యదేవ్

సైన్స్ ఫిక్షన్ సినిమాలు సైతం తెలుగులో వెలుగు చూస్తున్నాయి.  అందుకు స్టార్స్ సైతం సహకరిస్తున్నారు. ఇప్పటికే అంతరిక్షం వంటి స్పేస్ లో జరిగే కథలు తెలుగులో తెరకెక్కాయి. ఇప్పుడు మరో సైన్స్ ఫిక్షన్ తరహా కథాంశంతో రూపొందే సినిమాకు నిత్యా మీనన్ ఓకే చెప్పింది.

Nithyamenon new movie story based on Sky Lab incident
Author
Hyderabad, First Published Dec 31, 2019, 7:58 AM IST

కొత్త కొత్త కాన్సెప్టులతో కొత్త డైరక్టర్స్ ముందుకు వస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు సైతం తెలుగులో వెలుగు చూస్తున్నాయి.  అందుకు స్టార్స్ సైతం సహకరిస్తున్నారు. ఇప్పటికే అంతరిక్షం వంటి స్పేస్ లో జరిగే కథలు తెలుగులో తెరకెక్కాయి. ఇప్పుడు మరో సైన్స్ ఫిక్షన్ తరహా కథాంశంతో రూపొందే సినిమాకు నిత్యా మీనన్ ఓకే చెప్పింది. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్కైలాబ్ ని సెంట‌ర్ పాయింట్ చేసుకుని రాసుకున్న క‌థ‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ వ‌ర్గాలు చెప్పాయి.

అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన ఓ  స్కైలాబ్ ఇప్పటికీ జనం మర్చిపోరు. 1979లో వచ్చిన స్కైలాబ్ అప్పట్లో మన దేశంలో సంచలనం సృష్టించింది. ఆ స్కై లాబ్ ఎప్పుడు మనమీద పడిపోతుందో అని, జనం అంతా ఎప్పుడు ఏమౌతుందో అని భయంతో కాలం వెల్లదీశారు. ఆ సంఘటనల నేపథ్యంలో త్వరలో ఈ సినిమా తెలుగు తెరపైకి రాబోతోందని సమాచారం.

Nithyamenon new movie story based on Sky Lab incident

స్కైలాబ్ అంశాన్ని ప్ర‌ధాన కథావస్తువుగా తీసుకుని పిరియాడిక్ మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో త్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూష‌న్ చేసిన‌ కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తాజాగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

డా.కె.ర‌వికిర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో బైట్ ఫీచ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో అపృథ్వీ పిన్న‌మరాజు ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా విశ్వ‌క్ కందెరావ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  1979 లో సాగే పీరియాడిక్ మూవీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎంపిక చేసిన‌ట్టు వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక పూర్తి అవుతుంద‌ని అన్ని వివ‌రాల‌ను మీడియాకు ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios